నాలుగు కళ్ళ అబ్బాయి

నాలుగు కళ్ళ అబ్బాయి

Views: 1440
8 0
Read Time:5 Minute, 34 Second

“మమ్మీ మమ్మీ” బడి నుంచి యింటికొస్తూనే వీపునున్న పుస్తకాల సంచి వరండా లోని సోఫాలో పడేసి, తల్లి దగ్గరకు పరుగుతీస్తూ పిలిచింది మాలతి.

పెరటిలో సన్న జాజిపూల చెట్టుకు పాదు చేస్తున్న మాలతి తల్లి “ఎంటా పరుగు క్రింద పడతావ్” అంటూ గద్దించింది.

మాలతి ఆ గద్దింపును పట్టించుకోలేదు. తల్లిదాపుగా పరుగెత్తి “ఈ రోజు మా స్కూల్లో నాలుగు కళ్ళ అబ్బాయి ఒకరొచ్చారు తెలుసా?” అంది నవ్వుతూ.

“నాలుగు కళ్ళ అబ్బాయా?” తల్లి ఆశర్యంగా చూసింది. “ఫోర్ అయిస్” వత్తిపలికింది మాలతి.

“అసలు సంగతేమిటి? ఏదీ సరిగా చెప్పడం యింకా నేర్చుకో లేదు నీవు” అంది తల్లి.

“కుమార్ లేడూ ఏదీ మా క్లాస్ లో కుమార్ ఉన్నాడుగా అతను, అతను కళ్ళజోడు పెట్టుకోన్నాడు” నవ్వుతూ మాలతి అంది “కళ్ళజోడు పెట్టుకొంటే నవ్వెందుకు వస్తుంది?”

‘రాదా మరి? తాతల్లాగ, అమ్మమ్మల్లాగ, చిన్నపిల్లలు ఎక్క డైనా కళ్ళ జోడు పెట్టుకొంటారా?” అంది మాలతి.

కంటి జబ్బు ఏదైనా ఉండొచ్చు. అందువల్ల డాక్టర్ కళ్ళ జోడు వాడమని చెప్పివుంటారు” అంది మాలతి తల్లి.

“అందుకే నాలుగు కళ్ళు అని జోక్ చేశాం.”

“తప్పు పాపా, అలా ఎగతాళి చేయకూడదమ్మా, అతనికి ఏదో కంటిలోపం ఉండొచ్చు. మరొకరికి మరోలోపం ఉండొచ్చు. యీ లోకంలో అవిటితనం గల పిల్ల లెందరో ఉన్నారు. మూగివాళ్ళు గుడ్డివాళ్ళు కుంటివాళ్లు వాళ్ళందర్నీ చూసి ఎగతాళి చేస్తావా! తప్పమ్మా, వీలయితే సహాయం చేయాలి గాని ఎప్పుడూ చులకన చేయకూడదు “అంది తల్లి.

తను చెప్పిన దానికి తల్లికూడా నవ్వుతుందనుకొన్న తల్లి నవ్వక పోగా, తనదే తప్పు అని గద్దించడం నచ్చలేదు. మమ్మిలు ఎప్పుడూ యింతే మంచిగా నవ్వుకో నివ్వరు” అని ” సణుక్కొంటూ వెళ్ళిపోయింది.

ఓ నెల రోజుల తర్వాత

ఓ రోజు మాలతి సైకిల్ నేర్చుకుంటూ క్రింద పడింది. ఆమె కాలుకు బలమైన దెబ్బ తగలడం వలన మాలతి తల్లి కంగారు పడుతూ డాక్టరు దగ్గరకు తీసుకుపోయింది.

డాక్టరు మాలతి కాలును ఎక్సరే తీసి పెద్ద పిండికట్టువేశాడు. మాలతి కాలు క్రింద పెట్టలేకపోయింది. కొన్ని రోజులదాకా ఆమె కదల కూడదని డాక్టరు గారు చెప్పారు.

కట్టు విప్పినా చూలతి సరిగా నడవలేక పోయింది. కాలు మడతలో నొప్పిగా ఉండటం వలన కాలును ఈడ్చుకుంటూ నడవ సాగింది.

తోటి పిల్లలు మాలతిని చూస్తూ, “కుంటి మాలతీ” అంటూ ఎగతాళిగా నవ్వారు.

మాలతికి ఏడ్పాగింది కాదు. చెమ్మగిల్లిన కన్నుల్నితుడుచు కొంటూ, నెమ్మదిగా యింటి కేసి తిరిగింది.

ఎదురుగా కళ్ళజోడు కుమార్ కనిపించాడు. మాలతికి సిగే సి సింది. నాలుగు కళ్ళ కుమార్ అంటూ ఎగతాళి చేసిన కుమార్ యిప్పుడు తననేమని ఏడ్పిస్తాడో! అనుకొంది. తలెత్తి కుమార్ కేసి చూసే దైర్యం లేక తలదించుకొంది.

కుమార్ నెమ్మదిగా దగ్గర కొచ్చాడు. “ఏం మాలతి బాగు న్నావా? కాలు నొప్పి ఎలావుంది? భాధపడకు కొన్ని రోజులైతే నువ్వూ అందరిలా పరుడతావ్ సరేనా” అంటూ పలుకరించాడు.

మాలతికి ఆశ్చర్యమేసింది. ఎగతాళి చేస్తాడనుకొన్న కుమార్ మంచిగా మాట్లాడాడు • కాని తను! కుమార్ కళ్ళజోడు పెట్టుకొంటే ఎంత ఏడ్పించింది. ఛీ ఛీ నేను చేసింది. నిజంగా చెడ్డపనే. అను కొంది మాలతి.

నవ్వుతూ, ప్రేమగా కుమార్ కేసి చూసి, “అవును కుమార్, నువ్వు కళ్ళజోడు పెట్టుకుంటే నేను ఎగతాళి చేశాను కదా! మరి నువ్వు నన్ను ఎగతాళి చేయలేదెందుకు? సూటిగా అడిగింది మాలతి.

నేను సండేస్కూల్ కి వెళ్తాను మాలతీ. మా టీచర్ బాధల్లో ఉన్నవారిని ఓదార్చాలి తప్ప, వెక్కిరించకూడదు అని చెప్పింది.

నువ్వు నన్ను ఎగతాళి చేసినపుడు నేను చాలా బాధ పడ్డాను ఆ బాధ నేను అనుభవించాను కాబట్టి నిన్ను బాధ పెట్టడం నాకు యిష్టం లేదు “నెమ్మదిగా అన్నాడు కుమార్.

కుమార్ నన్ను క్షమించు. యిక మీదట నేనెవర్నీ ఎగతాళి చేయను. ఆంగవికలుల్నిగానీ, మరెవర్ని గానీ ఎప్పడూ బాధపడేలా చేయను” అంది మాలతి.

కుమార్ ఆనందంగా చూచి మాలతి చేయిపట్టుకొని యింటి కేసి నడిపించాడు.

Happy
Happy
80 %
Sad
Sad
12 %
Excited
Excited
5 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
2 %
Latest News సండే స్కూల్ కధలు