ఆదాము, అవ్వ చేసిన తప్పు ఏంటి !

ఆదాము, అవ్వ చేసిన తప్పు ఏంటి !

Views: 605
1 0
Read Time:2 Minute, 59 Second

             ‘యెహోవా దేవుడు చేసిన అన్ని భూజంతువుల్లో పాము యుక్తిగలది. అది ఆ స్త్రీతో ఇలా అంది : “తోటలో ఉన్న ఏ చెట్టు పండైనా మీరు తినకూడదన్న మాట దేవుడు నిజంగా చెప్పాడా?” *ఆ స్త్రీ పాముతో “తోటలో ఉన్న చెట్ల పళ్ళు మేము తినవచ్చు. ‘కాని, తోట మధ్యలో ఉన్న ఆ చెట్టు ఫలాన్ని గురించి దేవుడు ఇలా అన్నాడు- “మీరు చావకుండేలా దాన్ని తినకూడదు; దాన్ని తాకకూడదు సుమా” అని చెప్పింది. “పాము ఆ స్త్రీతో, “మీరు చావనే చావరు. కానీ మీరు దాన్ని తినే రోజున మీ మనోనేత్రాలు తెరుచుకుంటాయి. మీరు మేలు కీడు తెలిసి దేవుడిలాగా అవుతారని దేవుడికి తెలుసు” అంది. 

            ‘ఆ చెట్టు ఫలం తినడానికి మంచిదనీ, చూడడానికి రమ్యంగా ఉందనీ, జ్ఞానంకోసం కోరతగ్గదనీ ఆ స్త్రీకి కనబడడంతో దాని ఫలం తీసికొని తిన్నది. తనతో పాటు తన భర్తకు కొంత ఇచ్చింది. అతడుకూడా తిన్నాడు. ‘వారిద్దరికి మనోనేత్రాలు తెరుచుకున్నాయి. తాము నగ్నంగా ఉన్నామని తమకు తెలిసిపోయింది. వాళ్ళు అంజూర ఆకులను కుట్టి మొలకు చుట్టుకున్నారు. ‘సాయంకాలం యెహోవా దేవుడు తోటలో నడుస్తూ ఉన్న చప్పుడు వారికి వినిపించింది. ఆ మానవుడు, అతని భార్య యెహోవా దేవునికి కనిపించకుండేలా తోట చెట్లలో దాక్కొన్నారు. ‘యెహోవాదేవుడు ఆ మానవుణ్ణి పిలిచి “నీవెక్కడ ఉన్నావు?” అని అడిగాడు. ”మానవుడు “తోటలో నీ చప్పుడు నాకు వినిపించినప్పుడు భయం వేసింది. ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను. గనుక నేను దాక్కున్నాను” అన్నాడు.

           ”దేవుడు “నీవు నగ్నంగా ఉన్న సంగతి నీకు తెలియజేసిందెవరు? నేను నీకు ఆజ్ఞాపించి తినవద్దన్న చెట్టు ఫలాన్ని నీవు తిన్నావా?” అన్నాడు. మానవుడు ఇలా జవాబిచ్చాడు, “నాతోపాటు ఉండడానికి నీవు ఇచ్చిన స్త్రీ ఆ చెట్టు ఫలాన్ని నాకిచ్చింది. నేను తిన్నాను.” ‘యెహోవా దేవుడు ఆ స్త్రీతో “నీవు చేసినదేమిటి?” అన్నాడు.  “ఆ పాము నన్ను తప్పుదారి పట్టించింది. గనుక తిన్నాను” అంది.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Latest News