యిత్తడి సర్పము

యిత్తడి సర్పము

Views: 182
2 0
Read Time:2 Minute, 41 Second

యిత్తడి సర్పము (సంఖ్యాకాండము 21:1-9)

ఇశ్రాయేలు ప్రజలు అతారం గుండా వస్తున్నారని అరాదులో ఉన్న రాజు విన్నాడు. ఆ రాజు కనానుజాతివాడు, దక్షిణ ప్రదేశం నివాసి. అతడు ఇశ్రాయేలు ప్రజలతో యుద్ధం చేసి వారిలో కొంతమందిని బందీలుగా తీసుకువెళ్ళాడు. అందుచేత , ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు “నీవు ఈ జనాన్ని పూర్తిగా మా వశం చేస్తే మేము వాళ్ళ పట్టణాలను నాశనం చేసి తీరుతామ”ని మొక్కుబడి చేశారు. ‘యెహోవా వారి ప్రార్థన ఆలకించి ఆ కనానువాళ్లను వారి వశం చేశాడు. వారు వాళ్ళనూ, వాళ్ళ పట్టణాలనూ సర్వనాశం చేశారు. అందుచేత ఆ స్థలం పేరు “హోర్మా.”

“తరువాత ఇశ్రాయేలు ప్రజలు ఎదోం చుట్టూరా వెళ్ళాలని హోరు పర్వతంనుంచి ఎర్రసముద్రానికి వెళ్ళే త్రోవ పట్టి ప్రయాణం చేశారు. మార్గాయాసంచేత ప్రజలు ఓపిక పట్టలేక, ‘దేవునికీ మోషేకు విరోధంగా మాట్లాడి, “ఈ ఎడారిలో మేము చనిపోవాలని ఈజిప్ట్ నుంచి మీరు మమ్మల్ని రప్పించారెందుకు? ఇక్కడ తిండి లేదు, ? నీళ్లూ లేవు. ఈ చప్పని రొట్టెలు చూసి మాకు వెగటు పుడుతుంది” అన్నారు. అందుచేత ప్రజల మధ్యకు యెహోవా విషంగల పాములను పంపించాడు. అవి వారిని కరిచాయి, గనుక ఇశ్రాయేలు ప్రజల్లో చాలామంది చనిపోయారు.

‘అయితే ప్రజలు మోషే దగ్గరికి వచ్చి, “మేము యెహోవాకూ, నీకూ విరోధంగా మాట్లాడి తప్పిదం చేశాం, యెహోవా మామధ్యనుంచి ఈ పాములను తొలగించేలా ఆయనను వేడుకో” అని చెప్పారు . ప్రజలకోసం మోషే ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతడితో ఇలా అన్నాడు: “నీవు విషంగల పాములాంటి రూపాన్ని చేయించి స్తంభం మీద పెట్టు. పాము కరిచినవారెవరైనా సరే ఆ రూపంవైపు చూస్తే బ్రతుకుతారు.”

అందుచేత మోషే కంచు పామును చేయించి స్తంభంమీద ఉంచాడు. పాము కరిచినవారెవరైనా సరే ఆ కంచు పామును చూచినప్పుడు బ్రతికారు.

Happy
Happy
50 %
Sad
Sad
0 %
Excited
Excited
50 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Latest News పాత నిబంధన