నీళ్ళపై నడిచిన యేసు

నీళ్ళపై నడిచిన యేసు

Views: 841
1 0
Read Time:1 Minute, 51 Second

(మత్తయి 14:22-33)

                  యేసు జనసమూహాలను పంపివేస్తూ, శిష్యులను తనకంటే ముందుగా అవతలి ఒడ్డుకు వెళ్ళండని పడవ ఎక్కించాడు. ఆ గుంపులను పంపివేసిన తరువాత ప్రార్థన చేయడానికి తానొక్కడే కొండెక్కిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఆయన అక్కడే ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ పడవ సరస్సు మధ్యలో ఉంది. గాలి ఎదురుగా వీస్తూ ఉండడంవల్ల అది అలలకు కొట్టుకుపోతూ ఉంది.

 రాత్రి నాలుగో జామున యేసు సరస్సుమీద నడుస్తూ వారికి దగ్గరగా వచ్చాడు. “ఆయన సరస్సుమీద నడుస్తూ ఉండడం చూచి శిష్యులు హడలిపోయి “అది భూతం!” అని భయంతో కేకలు పెట్టారు. “వెంటనే యేసు వారిని పలకరించి “ధైర్యం తెచ్చు కోండి! నేనే! భయపడకండి!” అన్నాడు. 28 పేతురు ఆయనతో “ప్రభూ, నీవే అయితే, నన్ను నీ దగ్గరికి నీళ్ళమీద నడచి రమ్మనండి!” అన్నాడు.

ఆయన రమ్మన్నాడు. పేతురు పడవ దిగి, నీళ్ళమీద నడుస్తూ యేసువైపు వెళ్ళాడు. ‘కానీ గాలి ప్రబలంగా ఉండడం చూచి భయపడి, మునిగిపోయాడు. “ప్రభూ! నన్ను రక్షించు!” అని కేకపెట్టాడు. “వెంటనే యేసు చేయి చాచి అతణ్ణి పట్టుకొన్నాడు. “అల్ప విశ్వాసంగలవాడా సందేహపడ్డావేమిటి!” అని అతనితో అన్నాడు. వారు పడవ ఎక్కినప్పుడు గాలి ఆగింది. పడవలో ఉన్నవారు “నిజంగా నీవు దేవుని కుమారుడవు” అని చెప్పి ఆయనను ఆరాధించారు.

Happy
Happy
62 %
Sad
Sad
8 %
Excited
Excited
31 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
Latest News క్రొత్త నిబంధన సండే స్కూల్ కధలు