క్రొత్త నిబంధన
నాలుగు సువార్తలు (మత్తయి, మార్కు, లూకా, యోహాను ) యేసు జీవితాన్ని ఆయన బోధలను వేరు వేరు దృక్పథాలతో వర్ణిస్తాయి. యేసు అనంతరం, వెనువెంటనే తొలి అపోస్తులులు ఆయన సందేశాలను ఎలా ప్రకటించారో అపోస్తులుల కార్యములు వివరిస్తుంది. క్రొత్త ప్రాంతాల్లో వ్యాపించిన సువార్తను ప్రజలు ఎలా అర్థం చేసుకున్నారో ఆ సువార్తను వారెలా అన్వయించుకొన్నారో క్రొత్త నిబంధనలోని పత్రికలు తెలియజేస్తాయి. తొలి క్రైస్తవుల అనుభవాలను కూడా ఈ పత్రికలు ప్రతిధ్వనిస్తాయి. దేవుడు క్రొత్త భూమిని క్రొత్త ఆకాశాన్ని ఆవిష్కరిస్తాడనే నిరీక్షణతో క్రొత్త నిబంధనలోని చివరి గ్రంథమైన ప్రకటన ముగుస్తోంది.
క్రొత్త నిబంధన గ్రంథములోని పుస్తకములు


మన ప్రభువైన యేసుక్రీస్తు సూచకక్రియలు
నాలుగు సువార్తలలో వ్రాయబడినవి
- అయిదు వేలమందికి ఆహారం
మత్తయి
- 14: 15 - 21
మార్కు
- 6 : 35 - 44
లూకా
- 9 : 10 - 17
యోహాను
- 6 : 1 - 14
మూడు సువార్తలలో వ్రాయబడినవి
- కుష్ఠ రోగికి స్వస్థత
- పేతురు అత్తకు జ్వరంనుండి స్వస్థత
- సముద్రం మీద తుఫాను ఆగిపోవటం
- దయ్యాలు పందుల మందలో ప్రవేశించడం
- పక్షవాయువు ఉన్న వ్యక్తికి స్వస్థత
- యాయీరు కుమార్తెను బ్రతికించడం
- రక్తస్రావంతో బాధపడే స్త్రీకి స్వస్థత
- ఉచచెయ్యి గలవానికి స్వస్థత
- యేసు సముద్రం మీద నడవటం
- చాంద్రరోగికి స్వస్థత
- గ్రుడ్డివానికి స్వస్థత
మత్తయి
- 8 : 2 , 3
- 8 : 14 , 15
- 8 : 23 - 26
- 8 : 28 - 36
- 9 : 2 -8
- 9 : 18 , 19, 23 - 26
- 9 : 20 - 22
- 12 : 12 , 13
- 14 : 25 - 27
- 17 : 14 - 18
- 20 : 30 - 34
మార్కు
- 1 : 40 - 42
- 1 : 30, 31
- 4 : 35 - 39
- 5 : 1 - 13
- 2 : 3 - 12
- 5 : 22 - 24 , 35 - 41
- 5 : 25 - 34
- 3 : 1 - 5
- 6 : 48 - 51
- 9 : 17 - 27
- 10 : 46 - 52
లూకా
- 5 : 12 , 13
- 4 : 38 , 39
- 8 : 22 - 24
- 8 : 26 - 33
- 5 : 18 - 25
- 8 : 41 - 42 , 49 - 55
- 8 : 43 - 48
- 6 : 6 - 11
- -
- 9 : 37 - 42
- 18 : 35 - 43
యోహాను
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- 6 : 17 - 20
- -
- -
రెండు సువార్తలలో వ్రాయబడినవి
- శతాధిపతి దాసుని స్వస్థత
- దయ్యం పట్టిన గ్రుడ్డి మూగ వ్యక్తికి స్వస్థత
- కనాను స్త్రీ కుమార్తెకు స్వస్థత
- నాలుగు వేల మందికి ఆహారం
- అంజూరపు చెట్టును శపించడం
- అపవిత్రాత్మ పట్టిన వ్యక్తికి స్వస్థత
మత్తయి
- 8 : 5 - 13
- 12: 22
- 15 : 21 - 28
- 15 ; 32 - 38
- 21 : 19
- -
మార్కు
- -
- -
- 7 : 25 - 30
- -
- 11 : 14
- 1 : 23 - 26
లూకా
- 7 : 1 - 10
- 11 : 14
- -
- 8 : 1 - 9
- -
- 4 : 33 - 35
యోహాను
- -
- -
- -
- -
- -
- -
ఒక సువార్తలలో వ్రాయబడినవి
- ఇద్దరు గ్రుడ్డివారు చూపు పొందడం
- దెయ్యం పట్టిన మగవాణ్ణి స్వస్థపరచడం
- చేప నోటిలో షెకెలు దొరకడం
- చెవుడు మరియు నత్తి ఉన్న వ్యక్తికి స్వస్థత
- గుడ్డివాడు చూపు పొందడం
- విస్తారమైన చేపలు
- నాయీను విధవరాలి కుమారుడు మళ్లీ బ్రతకడం
- బలహీనపరిచే దయ్యం పట్టిన స్త్రీ స్వస్థత పొందడం
- జలోదర రోగికి స్వస్థత పొందడం
- పదిమంది కుష్టు రోగులు స్వస్థత పొందడం
- దాసుని చెవి భాగవడం
- కానాలో నీళ్ళు ద్రాక్షరసంగా మారడం
- సమరయ స్త్రీ చేసినవన్నీ చెప్పడం
- కపెర్నహూములోని ప్రధాని కుమారునికి స్వస్థత
- 38 సంవత్సరాలుగా వ్యాధి ఉన్న వ్యక్తికి స్వస్థత
- గుడ్డివాడు చూపు పొందడం
- మృతుడైన లాజరు తిరిగి బ్రతకడం
- నూట యాభై మూడు చేపలు వలలో పడడం
మత్తయి
- 9 : 27 - 31
- 9 : 32 , 33
- 17 : 27
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
మార్కు
- -
- -
- -
- 7 ; 32 - 35
- 8 : 22 - 25
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
లూకా
- -
- -
- -
- -
- -
- 5 : 5, 6
- 7 : 15
- 13 : 11 - 13
- 14 : 1 - 5
- 17 : 11 - 19
- 22 : 50 , 51
- -
- -
- -
- -
- -
- -
- -
- -
యోహాను
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- 2 : 1 - 11
- 4 : 29
- 4 : 46 - 51
- 5 : 1 - 9
- 9 : 1 - 7
- 11 ; 38 - 44
- 21 ; 1 - 11
అపోస్తులుల కార్యములు గ్రంథంలోని సూచకక్రియలు
- శృంగార దేవాలయం వద్ద కుంటివానికి స్వస్థత
- అననీయ సఫీరాల మరణం
- ప్రజలమధ్య అనేకులకు స్వస్థత
- ఫిలిప్పు సూచకక్రియలు
- పేతురు ఐనెయను స్వస్థపర్చడం
- పౌలు ఎలుమను గ్రుడ్డివానిగా చేయడం
- లుస్త్ర లో బలహీనపాదాలున్న వ్యక్తికి స్వస్థత
- పౌలు పుతోను దయ్యాన్ని తొలివేయడం
- పౌలు ఎఫెసులో చేసిన సూచకక్రియలు
- పౌలు ఐతుకును బ్రదికించడం
- పౌలును సర్పం కరచినప్పటికీ ఏమీ కాకపోవడం
- పౌలు పొప్లి తండ్రిని అనేకులను స్వస్థపర్చడం
అపో''
- 3 : 1 - 26
- 5 : 1 - 10
- 5 : 12 - 16
- 8 : 6 , 7
- 9 : 33 , 34
- 13 : 1 - 11
- 14 : 7 - 10
- 16 : 16 - 18
- 19 : 11 , 12
- 20 : 9 - 12
- 28 : 3 - 6
- 28 : 8 , 9
ఉపమానాల పట్టిక
- విత్తువాడు
- గురుగులు
- ఆవగింజ
- పుల్లని పిండి
- పొలంలో దాచబడిన ధనం
- అమూల్యమైన ముత్యం
- చేపల వల
- తప్పిపోయిన గొర్రె
- ద్రాక్ష తోటలోని పనివారు
- ద్రాక్షతోట యజమాని
- పెండ్లి విందు
- పదిమంది కన్యకలు
- తలాంతులు
- స్త్రీ పోగొట్టుకొన్న నాణెం
- తప్పిపోయిన కుమారుడు
మత్తయి
- 13 : 3 - 10
- 13 : 24 - 30
- 13 : 31 , 32
- 13 : 33
- 13 : 44
- 13 : 45 , 46
- 13 : 47 , 48
- 18 : 11 - 13
- 20 : 1 - 16
- 21 : 33 - 41
- 22 : 1 - 14
- 25 : 1 - 13
- 25 : 14 - 30
- -
- -
మార్కు
- 4 : 1 - 20
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- 12 : 1 - 9
- -
- -
- -
- -
- -
లూకా
- 8 : 4 - 15
- -
- 13 : 18 , 19
- 13 : 20 , 21
- -
- -
- -
- 15 : 1 - 7
- -
- 20 : 9 - 16
- 14 : 15 - 24
- -
- 19 : 11 - 27
- 15 : 8 - 10
- 15 : 11 - 32
యోహాను
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
- -
మత్తయి సువార్త (Matthew)
పరిచయం:
దేవుడు పాతనిబంధనలో తన ప్రజలకు వాగ్దానం చేసిన రక్షకుడు యేసు అని ఆయన వాగ్దానాలన్నీ యేసులో నెరవేరాయని మత్తయి సువార్త చెప్తుంది. ఈ శుభవార్త కేవలం యూదులకు మాత్రమే కాదని ఇది యావత్ ప్రపంచానికి అని కూడా ఈ సువార్త చెప్తుంది. యేసు జననం తో ప్రారంభమైన ఈ సువార్తలో ఆయన బాప్తీస్మం ఆయనకి ఎదురయినా శోధనలు ఆయన బోధలు ఆయన అద్భుత కార్యాలు ఆయన స్వస్థతలు ఒక చక్కని అమరికలో కనిపిస్తాయి. తర్వాత ఈ సువార్త యేసు ఇహలోక జీవితంలోని చివరి వారం గురించి ఆయన గలిలయ నుండి యెరూషలేముకు చేసిన ప్రయాణం గురించి ఆయన సిలువ మరణం గురించి ఆయన పునరుద్ధానం గురించి తెలియచేస్తాయి.
మార్కు సువార్త (Mark)
పరిచయం:
మార్కు సువార్తలో యేసు బోధల కంటే మిన్నగా ఆయన కార్యాలు మనసుకు హత్తుకునేలా సరళమైన వర్ణనలో కనిపిస్తాయి. బాప్తిస్మమిచ్చు యోహాను యేసు బాప్తిస్మం ఆయన శోధనల వర్ణన తర్వాత సువార్తలో ప్రధాన భాగం యేసు కార్యాల గురించి వివరిస్తోంది. తుది అధ్యాయాలు యేసు ఇహలోక జీవితంలోని చివరి వారంలో జరిగిన సంఘటనల గురించి ఆయన మరణ పునరుద్ధానాలా గురించి వివరిస్తున్నాయి.
లూకా సువార్త (Luke)
పరిచయం:
దేవుడు ఇశ్రాయేలుకు వాగ్దానం చేసిన రక్షకుడు సకల మానవాళి విమోచకుడు యేసేనని లూకా సువార్త తెలియజేస్తోంది. దేవుడు యేసును బీదలకు సువార్త ప్రకటించుటకై తన ఆత్మతో నింపాడని ప్రస్తావించిన ఈ సువార్తలో సంతోషనాదం అంతర్లీనంగా కనిపిస్తుంది. యేసు జననంతో ప్రారంభమై ఆయన పరిచర్యను బోధనలను ఆయన జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఆయన ఆరోహణంతో ముగిసిన ఈ సువార్తలో ప్రార్థన గురించి పరిశుద్ధాత్మ గురించి యేసు పరిచర్యలో స్త్రీల ప్రాముఖ్యత గురించి పాపక్షమాపణ గురించి ప్రత్యేక ప్రస్తావన కనిపిస్తోంది.
యోహాను సువార్త (John)
పరిచయం:
యోహాను సువార్త "శరీరధారియై..... మన మధ్య" నివసించిన "వాక్యము" యేసేనని ప్రస్తావిస్తుంది. పాఠకులు, దేవుడు వాగ్దానం చేసిన రక్షకుడు మరియు దేవుని కుమారుడు యేసేనని నమ్మి ఆయనలో జీవం పొందాలని రచయిత ఉద్దేశం. నీరు, రొట్టె, వెలుగు, గొర్రెలు కాపరి, ద్రాక్షావల్లి వంటి అతి సాధారణమైన దృష్టాంతాల ద్వారా రచయిత ఆధ్యాత్మిక సత్యాలను ప్రబోధించడం ఈ సువార్తలో విశేషాఅంశం.
అపొస్తలుల కార్యములు (Acts)
పరిచయం:
యేసు తొలి శిష్యులు పరిశుద్ధాత్మ నడిపింపులో యేరుషలేములోనూ యూదయ సమరయ దేశముల యందంటతను భూదిగంతముల వరకును ఎలా సువార్త ప్రకటించారో ప్రాముఖ్యంగా తెలియజేసే అపోస్తులుల కార్యములు గ్రంథాన్ని లూకా సువార్త తరువాయి భాగంగా చెప్పవచ్చు. యూదుల్లో ప్రారంభమై యావత్ ప్రపంచానికి వ్యాప్తి చెందిన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి ఈ గ్రంథంలో ప్రధాన కథనం. అపోస్తుల కార్యములు గ్రంథములోని ప్రధాన భాగాలు మూడు : (1) యేసు పునరుత్థానం తర్వాత యేరుషలేములో ప్రారంభమైన క్రైస్తవ ఉద్యమ స్ఫూర్తి; (2) పాలస్తీనాలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి; (3) మధ్యధరా ప్రాంతానికి ఇంకా అవతలి తీరాలకు రోమా వరకు వ్యాప్తి; యూదుల పర్వదినమైన పెంతుకోస్తునాడు యెరుషలేములో విశ్వాసుల మీదకు దిగివచ్చినా పరిశుద్ధాత్మ వలన జరిగిన కార్యాలు ఈ గ్రంథంలో విశేషాంశం.
రోమీయులకు (Romans)
పరిచయం:
పౌలు రోమా సంఘాన్ని దర్శించే ఉద్దేశంతో తన రాకకు వారిని సిద్ధం చేస్తూ రోమా పత్రిక వ్రాశాడు. రోమాలో కొంతకాలం పరిచర్య చేసి వారి సహాయ సహకారాలతో స్పెయినుకు వెళ్లాలని పౌలు ఆలోచన. క్రైస్తవ విశ్వాసం గురించి, విశ్వాసాన్ని దైనందిన జీవితంలో ఆచరించడం గురించి పౌలు తన అవగాహనలను విశదీకరిస్తూ వ్రాసిన ఈ పత్రిక అతని సందేశానికి సంగ్రహరూపాన్నిస్తోంది.
1 కొరింథీయులకు (1 Corinthians)
పరిచయం:
పౌలు కొరింథులో స్థాపించిన సంఘంలో క్రైస్తవ జీవితం గురించి విశ్వాసం గురించి తలెత్తిన సమస్యలను పరిష్కరించటానికి పౌలు ఈ పత్రిక వ్రాశాడు. ఆ కాలంలో రోమా సామ్రాజ్యంలోని అకయ ప్రాంతానికి ముఖ్య పట్టణమైన కోరింథు విభిన్న సంస్కృతులకు నిలయమై వ్యాపారానికి ధనికవర్గపు ఆడంబర జీవనశైలికి విచ్చలవిడితనానికి భిన్నమతారాధనలకు ప్రసిద్ధి చెందింది. కొరింథు సంఘంలో తలెత్తిన సమస్యల్లో కొన్ని ముఖ్య సమస్యలు : సంఘంలో వర్గ విభజనలు, అనైతిక జీవనం, వివాహ సంబంధమైన ప్రశ్నలు, మనస్సాక్షికి సంబంధించిన విషయాలు, సంఘంలో క్రమం, పరిశుద్ధాత్మ కృపా వరాలు మరియు పునరుద్ధానానికి సంబంధించిన ప్రశ్నలు. దేవుడు అనుగ్రహించిన వరాల్లో ప్రేమను అత్యంత ఉన్నతమైన వరంగా ప్రస్తావించే పదమూడవ అధ్యాయం అత్యంత ప్రజాదరణ పొందిన అధ్యాయం.
2 కొరింథీయులకు (2 Corinthians)
పరిచయం:
పౌలుకు కొరింథు సంఘానికి మధ్య అవగాహన లోపించిన సందర్భంలో అతను ఈ పత్రిక వ్రాశాడు. కొరింథు సంఘంలో కొందరు పౌలుని వ్యతిరేకించినప్పటికీ, పౌలు మాత్రం తనను వ్యతిరేకించిన వారితో సమ్మతి కోరుకోవడంతో బాటు సమ్మతి పొందినప్పుడు బహుగా సంతోషించాడు కూడా. పౌలు తన అపోస్తులత్వాన్ని సమర్థించుకోవడం ఈ పత్రికలో విశేషాంశం.
గలతీయులకు (Galatians)
పరిచయం:
అబద్ధ బోధ మూలంగా పెడత్రోవ పట్టిన విశ్వాసులను నిజమైన విశ్వాసానికి ఆచరణకు మళ్ళించడానికి పౌలు ఈ పత్రిక వ్రాశాడు. దేవుడు తనను యూదేతరులకు అపోస్తులుడుగా ఎన్నుకున్నాడని పౌలు వివరిస్తూ, క్రీస్తులోని విశ్వాసం ద్వారా జనించే ప్రేమ క్రైస్తవ నడతకు పునాది అని చెప్పడం ఈ పత్రికలో విశేషాంశం.
ఎఫెసీయులకు (Ephesians)
పరిచయం:
"సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలెనని" (1:10) దేవునికి ఉన్న సంకల్పాన్ని విశదీకరిస్తూ పౌలు ఈ పత్రిక వ్రాశాడు. క్రైస్తవులందరూ యేసుక్రీస్తును బట్టి ఏకతతో దేవుని సంకల్పానుసారం అర్థవంతంగా జీవించాలని పౌలు ఈ పత్రికలో మనవి చేస్తున్నాడు. శరీరం శిరస్సు ఇల్లు మూలరాయి భార్య భర్త వంటి అలంకార పద ప్రయోగంతో పౌలు క్రీస్తులోని ఏకతను వర్ణించటం ఈ పత్రికలోని విశేషాంశం.
ఫిలిప్పీయులకు (Philippians)
పరిచయం:
రోమా సామ్రాజ్యం లోని మాసిదోనియా ప్రాంతంలో పౌలు స్థాపించిన తొలి సంఘమైన ఫిలిప్పీ సంఘానికి పౌలు ఈ పత్రిక వ్రాస్తున్నాడు. ఈ పత్రిక రచనాకాలంలో పౌలు చెరసాలలో వండటం, మరోవైపు అతని పట్ల సాటి క్రైస్తవుల వ్యతిరేకత మరియు ఫిలిప్పీ సంఘంలో అబద్ధబోధ గమనించదగిన అంశాలు. యేసుక్రీస్తులోని ప్రగాఢ విశ్వాసం ద్వారా పౌలుకు కలిగిన ఆనందం మరియు ఆత్మస్థైర్యం క్రైస్తవుల్లో ఐకమత్యం మరియు పట్టుదల ఉండాలని పౌలు బోధించడం ఈ పత్రికలో కనిపించే విశేషాంశం.
కొలొస్సయులకు (Colossians)
పరిచయం:
చిన్న ఆసియాలో ఎఫెసీకు తూర్పున ఉన్న కొలస్స పట్టణంలో వున్న సంఘానికి పౌలు ఈ పత్రిక వ్రాశాడు. పౌలు ఈ సంఘాన్ని స్థాపించకపోయినప్పటికీ సంఘంపట్ల బాధ్యతతో వ్యవహరించి ఎఫెసు నుండి అక్కడికి పనివారిని పంపించాడు. పౌలు కొలొస్స సంఘంలో ప్రబలంగా వ్యాపించిన అబద్ధబోధలను వ్యతిరేకిస్తూ క్రీస్తు ద్వారా మాత్రమే రక్షణ కలుగుతుందని నొక్కి చెబుతూ ఈ పత్రిక వ్రాస్తున్నాడు. తుకికు అతనితోపాటు ఓనెసీము కొలొస్స సంఘాన్ని దర్శించి ఈ పత్రికను అందజేయడం విశేషాంశం.
1 థెస్సలొనీకయులకు (1 Thessalonians)
పరిచయం:
రోమా సామ్రాజ్యంలోని మాసిదోనియ ప్రాంతానికి థెస్సలోనిక ముఖ్య పట్టణము పౌలు ఫిలిప్పీని విడిచి పెట్టిన తర్వాత థెస్సలోనికలో సంఘాన్ని స్థాపిస్తాడు. అయితే యూదేతరుల మధ్య పౌలు పరిచర్యను వ్యతిరేకించిన కొందరు థెస్సలోనిక యుధులు పౌలు పట్ల విముఖత చూపినందు వల్ల పౌలు థెస్సలోనిక విడచి బెరయకు వెళ్ళాడు. థెస్సలోనిక సంఘంలో ఉన్న విశ్వాస ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ క్రీస్తు రెండవ రాకడ విషయంలో తలెత్తిన ప్రశ్నలకు బదులిస్తూ పౌలు ఈ పత్రిక వ్రాశాడు.
2 థెస్సలొనీకయులకు (2 Thessalonians)
పరిచయం:
క్రీస్తు రెండవ రాకడ గురించి థెస్సలోనిక సంఘంలో కొనసాగుతున్న అనిశ్చయతను రెండవ రాకడ జరిగిపోయిందనే కలవరాన్ని తొలగించడానికి పౌలు ఈ పత్రిక వ్రాశాడు. క్రీస్తు ద్వితీయాగమనానికి ముందు ధర్మ విరోధి దుష్టక్రియలు ముమ్మరం అవుతాయని పౌలు ఈ పత్రికలో పేర్కొనన్నాడు. శ్రమలు హింసలో ధైర్యంగా ఉంటూ విశ్వాసాన్ని కాపాడుకోవాలని జీవనోపాధి కొరకు కష్టపడి పని చేయాలని నిర్విరామంగా మంచి పనులు చేయాలని పౌలు సెలవు ఇవ్వటం ఈ పత్రికలోని విశేషాంశం.
1 తిమోతికి (1 Timothy)
పరిచయం:
చిన్నాసియాకు చెందిన యువ క్రైస్తవుడైన తిమోతి పౌలుకు పరిచర్యలో సహచరుడు, సహాయకుడు కూడా. అబద్ధ బోధను వ్యతిరేకిస్తూ, సంఘ పరిపాలనలో సంఘరాధనలో క్రమాన్ని నిర్దేశిస్తూ, సహ విశ్వాసులపట్ల తిమోతి బాధ్యతలను గుర్తు చేస్తూ పౌలు తిమోతికి ఈ పత్రిక వ్రాశాడు.
2 తిమోతికి (2 Timothy)
పరిచయం:
పౌలు తన పరిచర్యలో సహచరుడు మరియు సహాయ కుడైన తిమోతికి వ్యక్తిగత సూచనలిస్తూ ఈ పత్రిక వ్రాశాడు. సహనం కలిగి ఉండాలని సాక్ష్యాన్ని కాపాడుకోవాలని సత్యమైన బోధకు కట్టుబడి ఉండాలని నిష్ప్రయోజనమైన వాదనలకు దూరంగా ఉండాలని పౌలు తిమోతిని హెచ్చరించడం ఈ పత్రికలోని విశేషాంశాలు.
తీతుకు (Titus)
పరిచయం:
యూదేతరుడైన తీతు క్రైస్తవుడు అయిన తర్వాత పౌలుకు పరిచర్యలో సహచరుడుగా మరియు సహాయకుడుగా ఉన్నాడు. క్రెతులోని సంఘాన్ని పర్యవేక్షించడానికి పౌలు యువకుడైన తీతును అక్కడికి పంపించాడు. సంఘాధ్యక్షులకు సూచనలు సంఘంలోని భిన్నవర్గాలవారికి (వయోవృద్ధులు, యవ్వనస్త్రీలు, వృద్ధ స్త్రీలు యువకులు, బానిసలు) సలహాలు క్రైస్తవ నడతలో శాంతి సామరస్యం ఉండాలనే హెచ్చరికలు ఈ పత్రికలోని విశేషాంశాలు.
ఫిలేమోనుకు (Philemon)
పరిచయం:
ఫిలేమోను కొలొస్సలోని సంఘంలో ఒక ప్రముఖుడు. ఒనేసిము ఇతని బానిస. తన యజమానినుండి తప్పించుకొని పారిపోయిన ఒనేసిము చెరసాలలో పౌలును కలుసుకున్నాడు. పౌలు ద్వారా ఒనేసిము క్రైస్తవుడయ్యాడు. ఒనేసిమును తిరిగి చేర్చుకొమ్మని పంపిస్తూ అతన్ని బానిసగా కాక క్రైస్తవ సహోదరుడుగా స్వాగతించమని కోరుతూ పౌలు ఫిలేమోనుకు ఈ పత్రిక వ్రాశాడు.
హెబ్రీయులకు (Hebrews)
పరిచయం:
కొంతమంది క్రైస్తవులు తమ విశ్వాసాన్ని విడిచి పెట్టడానికి సిద్ధమైన తరుణంలో ఈ పత్రికను రచించడం జరిగింది. రచయిత వారి విశ్వాసాన్ని బలపరుస్తూ యేసు మహత్తును ఆధిపత్యాన్ని అధికారాన్ని పత్రికలో ప్రస్తావించాడు. ప్రవక్తలకంటే దేవదూతలకంటే మోషేకంటే క్రీస్తు ఉన్నతుడని ఆయన నిత్యుడైన ప్రధానయాజకుడని రచయిత ప్రస్తావించడం ఈ పత్రికలోని విశేషాంశం.
యాకోబు (James)
పరిచయం:
యాకోబు ఈ పత్రికను అన్య దేశములయందు చెదిరియున్న వారిని ఉద్దేశించి వ్రాశాడు. రచయిత ఆచరణాత్మకమైన జ్ఞానము గురించి క్రైస్తవ మనోవైఖరి గురించి క్రైస్తవ నడత గురించి వ్రాస్తూ సంపద, పేదరికం, శోధన, సత్ప్రవర్తన, దురభిమానం, విశ్వాసం, క్రియలు, నాలుకనుపయోగించడం, వివేకం, వివాదాలు, గర్వం, వినయం, విమర్శనాదృష్టి, ప్రగల్భాలు, సహనం, ప్రార్థన వంటి పలు అంశాలను ప్రస్తావిస్తాడు. విశ్వాసంతోపాటు క్రియలు ఉండాలని రచయిత పేర్కొనటం ఈ పత్రికలోని విశేషాంశం.
1 పేతురు (1 Peter)
పరిచయం:
చిన్న ఆసియాలోని ఉత్తర భాగంలో చెల్లాచెదరైన "ఏర్పరచబడినవారికి" పేతురు ఈ పత్రిక వ్రాశాడు. విశ్వాసాన్నిబట్టి శ్రమలు హింసలు అనుభవిస్తున్నవారికి ధైర్యం ఆదరణ నిరీక్షణ కలిగించడం ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం. శ్రమలు హింసలు విశ్వాసానికి పరీక్షలని వాటిని సహించినవారికి యేసు ప్రత్యక్షమైనప్పుడు "వాడబారని మహిమ కిరీటము" లభిస్తుందని రచయిత ప్రస్తావించడం ఈ పత్రికలోని విశేషాంశం.
2 పేతురు (2 Peter)
పరిచయం:
పేతురు తొలితరం క్రైస్తవుల నుద్దేశించి ఈ పత్రిక వ్రాశాడు. అబద్ధపు బోధ లను, వాటి ఫలితమైన అనైతిక జీవనాన్ని వ్యతిరేకిస్తూ ఈ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం దేవుని గురించి ప్రభువైన యేసుక్రీస్తు గురించి నిజమైన జ్ఞానాన్ని కలిగి ఉండడమని రచయిత ఈ పత్రికలో ప్రస్తావించాడు. రచయిత క్రీస్తు రాకడకు గల ఆలస్యాన్ని వివరిస్తూ "యెవడును నశింపవలెనని యిచ్చయింపక అందరూ మారుమనస్సు" పొందాలని దేవుడు కోరుకుంటున్నాడని చెప్పడం ఈ పత్రికలోని విశేషాంశం.
1 యోహాను (1 John)
పరిచయం:
దేవునితోను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతోను సహవాసం కలిగి ఉండాలని ప్రోత్సహిస్తూ, ఈ సహవాసాన్ని పాడుచేసే అబద్ధబోధల విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ యోహాను ఈ పత్రిక వ్రాశాడు. యేసును నమ్మి దేవుని ప్రేమించేవారందరూ తప్పక సాటివారిని ప్రేమించాలని రచయిత ప్రస్తావించడం ఈ పత్రికలోని విశేషాంశం.
2 యోహాను (2 John)
పరిచయం:
"అమ్మగారికిని ఆమె పిల్లలకును" అని సూచించబడిన స్థానిక సంఘానికి రచయిత తనను "పెద్ద"గా పేర్కొంటూ ఈ పత్రిక వ్రాశాడు. క్రైస్తవుల మధ్య పరస్పర ప్రేమ ఉండాలని, అబద్దబోధకులపట్ల వారి బోధనలు పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని రచయిత ఈ పత్రికలో క్లుప్త సందేశాన్ని ఇచ్చాడు.
3 యోహాను (3 John)
పరిచయం:
గాయు అనే సంఘపెద్దకు రచయిత తనను "పెద్ద"గా పేర్కొంటూ ఈ పత్రిక వ్రాశాడు. రచయిత గాయు చేస్తున్న పరిచర్యను బట్టి అతన్ని అభినందిస్తూ దియోత్రేఫే విషయంలో జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం ఈ క్లుప్తపత్రికలోని ప్రధానాంశం.
యూదా (Jude)
పరిచయం:
విశ్వాసులమని చెప్పుకునే అబద్ద బోధకులు గురించి హెచ్చరిస్తూ యూదా ఈ పత్రిక వ్రాశాడు. పేతురు వ్రాసిన రెండవ పత్రికకు ఈ పత్రికకు దగ్గరి పోలికలు ఉన్నాయి. పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని రచయిత పాఠకులను హెచ్చరించడం ఈ పత్రికలోని విశేషాంశం.
ప్రకటన గ్రంథము (Revelation)
పరిచయం:
క్రైస్తవులకు వారి విశ్వాసం కారణంగా శ్రమలు హింసలు ఎదురైన కాలంలో యోహాను ఈ గ్రంథాన్ని వ్రాశాడు. పాఠకులకు ఈ గ్రంథం ద్వారా నిరీక్షణను ధైర్యాన్ని కలిగిస్తూ, రచయిత వారు శ్రమల్లోను హింసల్లోను తమ విశ్వాసాన్ని కాపాడుకోవాలని కోరుతున్నాడు. ఈ గ్రంథంలో సాదృశ్యరూపంలో కనిపించే పలు దర్శనాలను ప్రత్యక్షతలను నాటి క్రైస్తవులు అర్ధం చేసుకోగలడం గమనార్హం. దేవుని ప్రజల నెదురించిన సాతాను అంతిమ పరాజయం, శత్రువల అంతిమ ఓటమి, నమ్మకంగా ఉన్నవారికి లభించే బహుమానం, క్రొత్త ఆకాశం క్రొత్త భూమి గురించిన వాగ్దానం బైబిల్లోని చివరి గ్రంథమైన ప్రకటనలో కనిపిస్తాయి.