(parables) ఉపమానాలు

(parables) ఉపమానాలు

ఉపమానాలు

ఉపమానాలు

పోయి దొరికిన గొడ్డలి

ప్రవక్తల బృందం ఎలిషా దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. “చూడండి, మీ దగ్గర మాకున్న ఈ స్థలం ఇరుకుగా ఉంది. మమ్మల్ని యొర్దానుకు వెళ్ళనివ్వండి. తలా ఒక దూలం తయారు చేసి మాకోసం నివాసం…

నూనె కొండలు

                    ప్రవక్తల బృందంలో ఒకని భార్య ఎలీషాను చూచి ఇలా మొరపెట్టుకుంది. మీ సేవకుడైన నా భర్త చనిపోయారు. ఆయనకు యెహోవా…

వేడి నీటిలో ఉన్న కప్ప

వేడి నీటిలో ఉన్న కప్ప ఒక చిన్న కుర్రాడు ఇంటిలో మౌనంగా తన హోం వర్క్ చేసుకుంటున్నాడు. ఆ ఇంటిలో ఒక మూల ఒక కప్ప ఆగకుండా అరుస్తూనే ఉంది. దాని శబ్దం ఆ…

స్వార్ధపు ఆలోచన

స్వార్ధపు ఆలోచన ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఒక పెద్ద కుటుంబమును కలిగియుండెను. కుటుంబము పట్ల అతనికి ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నప్పటికీ అతని కుటుంబ సభ్యులు మాత్రం అతని వెనుక ఉన్న ధనమునే ఆశిస్తూ…

ఉపమానములు-Parables

 మత్తయి 13: 34లో ఈ రీతిగా చెప్పబడింది. “యేసు ఈ సంగతులు అన్నిటినీ జనసమూహములకు ఉపమానరీతిగా బోధించెను; ఉపమానము లేక వారికి ఏమియు బోధింపలేదు”. ఆయన లోతైన ఆత్మీయ మర్మాలను విపులంగా వివరించుటకుగాను మన అనుదిన జీవితంలో జరుగు సంఘటనలను మరియు సామాన్య కథలను ఉదాహరిస్తూ ఉపమానరీతిగా బోధించవలెనన్న ఉద్దేశంతో ఈ ఉపమానాలను వాడడం జరిగింది. ఉపమానాలు లేని ఉపదేశాలు ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. ఎవరికీ ఏమీ అర్థం కాదు. ఆ కాసేపు అర్థం అయినట్లు అనిపించినా ఆ తరువాత ఏమీ గుర్తు ఉండదు. జనాలు ఉపదేశాలు మర్చిపోతారేమోగానీ ఉపమానాలు మరిచిపోరు.

బైబిల్ ఉపమానాల విషయ సూచిక

మార్కు 4 : 1 – 33

1.ఆయన సముద్రతీరమున మరల బోధింప నారం భింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నం దున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుం డెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.
ఆయన ఉపమానరీతిగా చాల సంగతులు వారికి బోధిం చుచు తన బోధలో వారితో ఇట్లనెను
వినుడి; ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్లెను.
వాడు విత్తు చుండగా కొన్ని విత్తనములు త్రోవప్రక్కను పడెను. పక్షులువచ్చి వాటిని మింగివేసెను.
కొన్ని చాల మన్ను లేని రాతినేలను పడెను; అక్కడ మన్ను లోతుగా ఉండ నందున అవి వెంటనే మొలిచెను గాని
సూర్యుడు ఉద యింపగానే అవి మాడి, వేరులేనందున ఎండిపోయెను.
కొన్ని ముండ్లపొదలలో పడెను; ముండ్లపొదలు ఎదిగి వాటిని అణచివేసెను గనుక అవి ఫలింపలేదు.
కొన్ని మంచినేలను పడెను; అవి మొలిచి పెరిగి పైరై ముప్పదం తలుగాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించెను.
వినుటకు చెవులుగలవాడు వినునుగాక అని చెప్పెను.
10 ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు పండ్రెండుమంది శిష్యు లతో కూడ ఆయనచుట్టు ఉండినవారు ఆ ఉపమానమును గూర్చి ఆయన నడిగిరి.
11 అందుకాయనదేవుని రాజ్య మర్మము (తెలిసికొనుట) మీకు అనుగ్రహింపబడియున్నది గాని
12 వెలుపలనుండువారు ఒకవేళ దేవునివైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని, వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుట కును అన్నియు ఉపమానరీతిగా వారికి బోధింపబడుచున్న వని వారితో చెప్పెను
13 మరియుఈ ఉపమానము మీకు తెలియలేదా? ఆలాగైతే ఉపమానములన్నియు మీకేలాగు తెలియుననెను.
14 విత్తువాడు వాక్యము విత్తు చున్నాడు.
15 త్రోవప్రక్క నుండువారెవరనగా, వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్య మెత్తికొనిపోవును.
16 అటువలె రాతినేలను విత్తబడినవారెవరనగా, వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు;
17 అయితే వారిలో వేరు లేనందున, కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలుగ గానే వారు అభ్యంతరపడుదురు.
18 ఇతరులు ముండ్లపొదలలో విత్తబడినవారు;
19 వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములును, ధనమోసమును మరి ఇతరమైన అపేక్ష లును లోపల చొచ్చి, వాక్యమును అణచివేయుటవలన అది నిష్ఫలమగును.
20 మంచి నేలను విత్తబడినవారెవ రనగా, వాక్యము విని, దానిని అంగీకరించి ముప్పదంతలు గాను అరువదంతలుగాను నూరంతలుగాను ఫలించువారని చెప్పెను.
21 మరియు ఆయన వారితో ఇట్లనెనుదీపము దీప స్తంభముమీద నుంచబడుటకే గాని కుంచము క్రిందనైనను మంచముక్రిందనైన నుంచబడుటకు తేబడదు గదా
22 రహస్య మేదైనను తేటపరచబడకపోదు; బయలుపరచ బడుటకే గాని యేదియు మరుగుచేయబడలేదు
23 వినుటకు చెవులెవనికైన నుండినయెడల వాడు వినునుగాకనెను.
24 మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును.
25 కలిగినవానికి ఇయ్యబడును, లేనివానికి కలిగినదియు వానియొద్దనుండి తీసివేయబడునని వారితో చెప్పెను.
26 మరియు ఆయనఒక మనుష్యుడు భూమిలో విత్త నము చల్లి,
27 రాత్రింబగళ్లు నిద్రపోవుచు, మేల్కొనుచు నుండగా, వానికి తెలియని రీతిగా ఆ విత్తనము మొలిచి పెరిగినట్లే దేవుని రాజ్యమున్నది.
28 ​భూమి మొదట మొల కను తరువాత వెన్నును అటుతరువాత వెన్నులో ముదురు గింజలను తనంతటతానే పుట్టించును.
29 పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని సేద్యగాడు వెంటనే కొడవలి పెట్టి కోయునని చెప్పెను.
30 మరియు ఆయన ఇట్లనెనుదేవుని రాజ్యమును ఎట్లు పోల్చెదము? ఏ ఉపమానముతో దానిని ఉపమించెదము?
31 అది ఆవగింజను పోలియున్నది. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమిమీదనున్న విత్తనములన్నిటికంటె చిన్నదే గాని
32 విత్తబడిన తరువాత అది మొలిచి యెదిగి కూర మొక్కలన్నిటికంటె పెద్దదైగొప్ప కొమ్మలు వేయును గనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను.
33 వారికి వినుటకు శక్తి కలిగినకొలది యీలాటి అనేక మైన ఉపమానములను చెప్పి, ఆయన వారికి వాక్యము బోధించెను.

మత్తయి 13 : 24 – 30

24 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగాపరలోకరాజ్యము, తన పొలములో మంచి విత్తనము విత్తిన యొక మనుష్యుని పోలియున్నది.
25 మనుష్యులు నిద్రించుచుండగా, అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయెను.
26 మొలకలు పెరిగి గింజపట్టినప్పుడు గురుగులు కూడ అగపడెను.
27 అప్పుడు ఇంటి యజమానుని దాసులు అతనియొద్దకు వచ్చి అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి గదా,అందులో గురుగు లెక్కడనుండి వచ్చినవని అడిగిరి.
28 ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు మేము వెళ్లి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా? అని అతనిని అడిగిరి.
29 అందుకతడు వద్దు; గురుగులను పెరుకుచుండగా, వాటితోకూడ ఒకవేళ గోధుమలను పెల్లగింతురు.
30 కోతకాలమువరకు రెంటినికలిసి యెదుగ నియ్యుడి; కోతకాలమందు గురుగులను ముందుగాకూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగాండ్రతో చెప్పుదు ననెను.

మత్తయి 13 : 31 – 32

31 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒకడు తీసికొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది.
32 అది విత్తనములన్నిటిలో చిన్నదేగాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశపక్షులు వచ్చి దాని కొమ్మలయందు నివసించు నంత చెట్టగును.

మత్తయి 13 : 33 – 34

33 ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను పరలోకరాజ్యము, ఒక స్త్రీ తీసికొని పిండి అంతయు పులిసి పొంగువరకు మూడు కుంచముల పిండిలో దాచి పెట్టిన పుల్లని పిండిని పోలియున్నది.
34 నేను నా నోరు తెరచి ఉపమానరీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగుచేయబడినసంగతులను తెలియజెప్పెదను
35 అని ప్రవక్త చెప్పినమాట నెరవేరునట్లు యేసు ఈ సంగ తులనన్నిటిని జనసమూహములకు ఉపమానరీతిగా బోధిం చెను;

మత్తయి 13 : 44

44 పరలోకరాజ్యము, పొలములో దాచబడిన ధనమును పోలియున్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచి పెట్టి, అది దొరికిన సంతోషముతో వెళ్లి, తనకు కలిగిన దంతయు అమి్మ ఆ పొలమును కొనును.

మత్తయి 13 : 45 – 46

45 మరియు పరలోకరాజ్యము, మంచి ముత్యములను కొన వెదకుచున్న వర్తకుని పోలియున్నది.
46 అతడు అమూల్య మైన యొక ముత్యమును కనుగొని, పోయి తనకు కలిగిన దంతయు అమి్మ దాని కొనును.

మత్తయి 13 : 47 – 48

47 మరియు పరలోకరాజ్యము, సముద్రములో వేయబడి నానావిధములైన చేపలను పట్టిన వలను పోలియున్నది.
48 అది నిండినప్పుడు దానిని దరికి లాగి, కూర్చుండి, మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని బయట పారవేయు దురు.

లూకా 15 : 1 – 32

1. ఒకప్పుడు సమస్తమైన సుంకరులును పాపులును ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా
పరిసయ్యులును శాస్త్రులును అది చూచిఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడ భోజనము చేయుచున్నాడని చాల సణుగుకొనిరి.
అందుకాయన వారితో ఈ ఉపమానము చెప్పెను
మీలో ఏ మనుష్యునికైనను నూరు గొఱ్ఱలు కలిగి యుండగా వాటిలో ఒకటి తప్పిపోయినయెడల అతడు తొంబది తొమి్మదింటిని అడవిలో విడిచిపెట్టి, తప్పిపోయి నది దొరకువరకు దానిని వెదక వెళ్లడా?
అది దొరకి నప్పుడు సంతోషముతో దానిని తన భుజములమీద వేసి కొని యింటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి
మీరు నాతోకూడ సంతోషించుడి; తప్పి పోయిన నా గొఱ్ఱ దొరకినదని వారితో చెప్పును గదా.
అటువలె మారుమనస్సు అక్కరలేని తొంబది తొమి్మది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషముకంటె మారుమనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలొక మందు ఎక్కువ సంతోష
ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?
అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా.
10 అటు వలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.
11 మరియు ఆయన ఇట్లనెనుఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
12 వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
13 కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.
14 అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
15 వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.
16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.
17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
18 నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
19 ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
20 వాడింక దూర ముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
21 అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యు డను కాననెను.
22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
23 క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;
24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
25 అప్పుడు అతని పెద్ద కుమా రుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని
26 దాసులలో ఒకని పిలిచిఇవి ఏమిటని అడుగగా
27 ఆ దాసుడు అతనితోనీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.
28 అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను.
29 అందుకతడు తన తండ్రితోఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేక
30 అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
31 అందుకతడుకుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,
32 మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

మత్తయి 20 : 1 – 16

1. ఏలాగనగాపరలోకరాజ్యము ఒక ఇంటి యజ మానుని పోలియున్నది. అతడు తన ద్రాక్షతోటలో పని వారిని కూలికి పెట్టుకొనుటకు ప్రొద్దున బయలుదేరి
దినమునకు ఒక దేనారము2 చొప ్పున పనివారితో ఒడబడి, తన ద్రాక్షతోటలోనికి వారిని పంపెను.
తరువాత అతడు దాదాపు తొమి్మది గంటలకు వెళ్లి సంత వీధిలో ఊరక నిలిచియున్న మరికొందరిని చూచిఒ మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
మీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడి, యేమి న్యాయమో అది మీకిత్తునని వారితో చెప్పగా వారును వెళ్లిరి.
దాదాపు పండ్రెండు గంటలకును, మూడు గంటలకును, అతడు మరల వెళ్లి, ఆలాగే చేసెను.
తిరిగి దాదాపు అయిదు గంట లకు వెళ్లి, మరికొందరు నిలిచియుండగా చూచిఇక్కడ దినమంతయు మీరెందుకు ఊరకనే నిలిచియున్నారని వారిని అడుగగా
వారు ఎవడును మమ్మును కూలికి పెట్టుకొన లేదనిరి. అందుకతడుమీరును నా ద్రాక్షతోటలోనికి వెళ్లుడనెను.
సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్షతోట యజమానుడు తన గృహనిర్వాహకుని చూచిపనివారిని పిలిచి, చివర వచ్చినవారు మొదలుకొని మొదట వచ్చిన వారివరకు వారికి కూలి ఇమ్మని చెప్పెను.
దాదాపు అయిదు గంటలకు కూలికి కుదిరినవారు వచ్చి ఒక్కొక దేనారముచొప్పున తీసికొనిరి.
10 మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరకుననుకొనిరి గాని వారికిని ఒక్కొక దేనారముచొప్పుననే దొరకెను.
11 ​వారది తీసికొని చివర వచ్చిన వీరు ఒక్కగంట మాత్రమే పనిచేసినను,
12 పగలంతయు కష్టపడి యెండబాధ సహించిన మాతో వారిని సమానము చేసితివే అని ఆ యింటి యజ మానునిమీద సణుగుకొనిరి.
13 అందుకతడు వారిలో ఒకని చూచిస్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయ లేదే; నీవు నాయొద్ద ఒక దేనారమునకు ఒడబడలేదా? నీ సొమ్ము నీవు తీసికొని పొమ్ము;
14 నీ కిచ్చినట్టే కడపట వచ్చిన వీరికిచ్చుటకును నాకిష్టమైనది;
15 నాకిష్టమువచ్చి నట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయము కాదా? నేను మంచివాడనైనందున నీకు కడుపుమంటగా ఉన్నదా3 అని చెప్పెను.
16 ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.

మత్తయి 21 : 33 – 41

33 మరియొక ఉపమానము వినుడి. ఇంటి యజమాను డొకడుండెను. అతడు ద్రాక్షతోట నాటించి, దాని చుట్టు కంచె వేయించి, అందులో ద్రాక్షలతొట్టి తొలి పించి, గోపురము కట్టించి, కాపులకు దాని గుత్తకిచ్చి, దేశాంతరము పోయెను.
34 ​పండ్లకాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసికొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసులనంపగా
35 ఆ కాపులు అతని దాసు లను పట్టుకొని, యొకని కొట్టిరి యొకని చంపిరి, మరి యొకనిమీద రాళ్లు రువి్వరి.
36 మరల అతడు మునుపటి కంటె ఎక్కువమంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి.
37 తుదకునా కుమారుని సన్మానిం చెదరనుకొని తన కుమారుని వారి యొద్దకు పంపెను.
38 అయినను ఆ కాపులు కుమారుని చూచిఇతడు వార సుడు; ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసికొందము రండని తమలోతాము చెప్పుకొని
39 అతని పట్టుకొని ద్రాక్షతోట వెలుపట పడవేసి చంపిరి.
40 కాబట్టి ఆ ద్రాక్షతోట యజమానుడు వచ్చినప్పుడు ఆ కాపుల నేమి చేయుననెను.
41 అందుకు వారుఆ దుర్మార్గులను కఠిన ముగా సంహరించి, వాటివాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతరకాపులకు ఆ ద్రాక్షతోట గుత్త కిచ్చునని ఆయనతో చెప్పిరి.

మత్తయి 22 : 1 – 14

1. యేసు వారికుత్తరమిచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లనెను.
పరలోకరాజ్యము, తన కుమారునికి పెండ్లి విందుచేసిన యొక రాజును పోలియున్నది.
ఆ పెండ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తనదాసు లను పంపినప్పుడు వారు రానొల్లక పోయిరి.
కాగా అతడుఇదిగో నా విందు సిద్ధపరచియున్నాను; ఎద్దు లును క్రొవ్విన పశువులును వధింపబడినవి; అంతయు సిద్ధ ముగా ఉన్నది; పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను గాని
వారు లక్ష్యము చేయక, ఒకడు తన పొలమునకును మరియొకడు తన వర్తకమునకును వెళ్లిరి.
తక్కినవారు అతని దాసులను పట్టుకొని అవమానపరచి చంపిరి.
కాబట్టి రాజు కోప పడి తన దండ్లను పంపి, ఆ నరహంతకులను సంహరించి, వారి పట్టణము తగలబెట్టించెను.
అప్పుడతడుపెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడినవారు పాత్రులు కారు.
గనుక రాజమార్గములకు పోయి మీకు కనబడు వారినందరిని పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను.
10 ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డ వారినేమి మంచివారినేమి తమకు కనబడినవారి నందరిని పోగుచేసిరి గనుక విందుకు వచ్చినవారితో ఆ పెండ్లి శాల నిండెను.
11 రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి, అక్కడ పెండ్లివస్త్రము ధరించుకొనని యొకని చూచి
12 స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.
13 అంతట రాజువీని కాళ్లు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను.
14 కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడినవారు కొందరే అని చెప్పెను.

మత్తయి 25 : 1 – 13

1.పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది.
వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు.
బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె తీసికొనిపోలేదు.
బుద్ధిగలవారు తమ దివిటీలతోకూడ సిద్దెలలో నూనె తీసి కొనిపోయిరి.
పెండ్లికుమారుడు ఆలస్యము చేయగా వారందరు కునికి నిద్రించు చుండిరి.
అర్ధరాత్రివేళ ఇదిగో పెండ్లికుమారుడు, అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడెను.
అప్పుడు ఆ కన్యకలందరు లేచి తమ దివిటీలను చక్కపరచిరి గాని
బుద్ధిలేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవుచున్నవి గనుక మీ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగలవారినడిగిరి.
అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
10 వారు కొనబోవుచుండగా పెండ్లికుమారుడు వచ్చెను, అప్పుడు సిద్ధపడి యున్నవారు అతనితో కూడ పెండ్లి విందుకు లోపలికి పోయిరి;
11 అంతట తలుపు వేయబడెను. ఆ తరు వాత తక్కిన కన్యకలు వచ్చిఅయ్యా, అయ్యా, మాకు తలుపు తీయుమని అడుగగా
12 అతడుమిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.
13 ఆ దినమై నను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.

మత్తయి 25 : 14 – 30

14 (పరలోకరాజ్యము) ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారి కప్ప గించినట్లుండును.
15 అతడు ఒకనికి అయిదు తలాంతులను1 ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
16 అయిదు తలాంతులు తీసికొనినవాడు వెళ్లి వాటితో వ్యాపారము చేసి, మరి అయిదు తలాంతులు సంపా దించెను.
17 ఆలాగుననే రెండు తీసికొనినవాడు మరి రెండు సంపాదించెను.
18 అయితే ఒక తలాంతు తీసికొనినవాడు వెళ్లి, భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను.
19 బహు కాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారియొద్ద లెక్క చూచుకొనెను.
20 అప్పుడు అయిదు తలాంతులు తీసికొనినవాడు మరి అయిదు తలాంతులు తెచ్చిఅయ్యా, నీవు నాకు అయిదు తలాంతులప్పగించి తివే; అవియుగాక మరి యయిదు తలాంతులు సంపా దించితినని చెప్పెను.
21 అతని యజమానుడుభళా, నమ్మక మైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మక ముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అత
22 ఆలాగే రెండు తలాంతులు తీసికొనినవాడు వచ్చిఅయ్యా, నీవు నాకు రెండు తలాంతులప్పగించితివే అవియు గాక మరి రెండు తలాంతులు సంపాదించితినని చెప్పెను.
23 అతని యజమానుడుభళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమా నుని సంతోషములో పాలు పొందుమని అత
24 తరువాత ఒక తలాంతు తీసికొనినవాడును వచ్చి — అయ్యా, నీవు విత్తనిచోట కోయువాడవును, చల్లని చోట పంట కూర్చుకొనువాడవునైన కఠినుడవని నేనెరుగు దును
25 గనుక నేను భయపడి, వెళ్లి నీ తలాంతును భూమిలో దాచిపెట్టితిని; ఇదిగో నీది నీవు తీసికొనుమని చెప్పెను.
26 అందుకు అతని యజమానుడు వానిని చూచిసోమరివైన చెడ్డ దాసుడా, నేను విత్తనిచోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకొనువాడనని నీవు ఎరుగుదువా?
27 అట్లయితే నీవు నా సొమ్ము సాహుకారులయొద్ద ఉంచ వలసి యుండెను; నేను వచ్చి వడ్డితోకూడ నా సొమ్ము తీసికొనియుందునే అని చెప్పి
28 ఆ తలాంతును వాని యొద్దనుండి తీసివేసి, పది తలాంతులు గలవాని కియ్యుడి.
29 కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును.
30 మరియు పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండుననెను.

లూకా 15 : 8 – 10

ఏ స్త్రీకైనను పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకొంటె ఆమె దీపము వెలిగించి యిల్లు ఊడ్చి అది దొరకువరకు జాగ్రత్తగా వెదకదా?
అది దొరకినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడ సంతోషించుడి, నేను పోగొట్టుకొనిన నాణము దొరకినదని వారితో చెప్పును గదా.
10 అటు వలె మారుమనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతలయెదుట సంతోషము కలుగునని మీతో చెప్పు చున్నాననెను.

లూకా  15 : 11 – 32

11 మరియు ఆయన ఇట్లనెనుఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి.
12 వారిలో చిన్నవాడుతండ్రీ, ఆస్తిలో నాకువచ్చు భాగమిమ్మని తన తండ్రి నడు గగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను.
13 కొన్నిదినములైన తరు వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూర దేశమునకు ప్రయాణమై పోయి, అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారమువలన పాడుచేసెను.
14 అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవు రాగా వాడు ఇబ్బంది పడ సాగి,
15 వెళ్లి ఆ దేశస్థులలో ఒకనిచెంత జేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వానిని పంపెను.
16 వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన అశపడెను గాని యెవడును వాని కేమియు ఇయ్యలేదు.
17 అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడునా తండ్రియొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవు చున్నాను.
18 నేను లేచి నా తండ్రియొద్దకు వెళ్లి–తండ్రీ, నేను పరలోకమునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని;
19 ఇకమీదట నీ కుమారుడనని అని పించుకొనుటకు యోగ్యుడను కాను; నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుమని అతనితో చెప్పుదు ననుకొని, లేచి తండ్రియొద్దకు వచ్చెను.
20 వాడింక దూర ముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి, పరుగెత్తి వాని మెడమీదపడి ముద్దుపెట్టుకొనెను.
21 అప్పుడు ఆ కుమారుడు అతనితోతండ్రీ, నేను పరలోక మునకు విరోధముగాను నీ యెదుటను పాపము చేసితిని; ఇకమీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యు డను కాననెను.
22 అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికికట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి;
23 క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదము;
24 ఈ నా కుమారుడు చనిపోయి మరల బ్రదికెను, తప్పిపోయి దొరకెనని చెప్పెను; అంతట వారు సంతోషపడసాగిరి.
25 అప్పుడు అతని పెద్ద కుమా రుడు పొలములో ఉండెను. వాడు (పొలమునుండి) వచ్చుచు ఇంటిదగ్గరకు రాగా, వాద్యములును నాట్యమును జరుగుట విని
26 దాసులలో ఒకని పిలిచిఇవి ఏమిటని అడుగగా
27 ఆ దాసుడు అతనితోనీ తమ్ముడు వచ్చి యున్నాడు, అతడు తన యొద్దకు సురక్షితముగా వచ్చి నందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించెననెను.
28 అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లక పోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి (లోపలికి రమ్మని) బతిమాలుకొనెను.
29 అందుకతడు తన తండ్రితోఇదిగో యిన్నియేండ్లనుండి నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే; అయినను నా స్నేహితులతో సంతోషపడునట్లు నీవు నాకెన్నడును ఒక మేక
30 అయితే నీ ఆస్తిని వేశ్యలతో తిని వేసిన యీ నీ కుమారుడు రాగానే వీనికొరకు క్రొవ్విన దూడను వధించితివని చెప్పెను.
31 అందుకతడుకుమారుడా, నీ వెల్లప్పుడును నాతోకూడ ఉన్నావు; నావన్నియు నీవి,
32 మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే; ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రదికెను, తప్పిపోయి దొరకెనని అతనితో చెప్పెను.

వివిధ ఉపమానాల విషయ సూచిక

ఒకానొకప్పుడు ఒక ధనవంతుడు ఒక పెద్ద కుటుంబమును కలిగియుండెను. కుటుంబము పట్ల అతనికి ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నప్పటికీ అతని కుటుంబ సభ్యులు మాత్రం అతని వెనుక ఉన్న ధనమునే ఆశిస్తూ ఉండేవారు. వారు ఆయన పట్ల కపట ప్రేమ, శ్రద్ధ చూపుతుండేవారు. పాపం ధనవంతుడు ఇది తెలుసుకోలేకపోయాడు.

ఒకానొక దినమున ధనవంతుడు జబ్బు చేసి మంచాన పడ్డాడు. కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఆయన పట్ల శ్రద్ధ చూపించకపోగా ఎవరి పనుల్లో వారు నిమగ్నమైపోయారు. కానీ ఒక అపరిచితుడు ప్రతిదినం సాయంత్రము వచ్చి ధనవంతుని యోగక్షేమములు అడుగుతుండేవాడు. అతను ప్రతి సాయంత్రం వస్తూ ” అయ్యగారి ఆరోగ్యం ఎలా ఉన్నది బాగున్నారా” అని అడుగుతూ ఉండేవాడు. కొన్ని రోజుల తరువాత ఆ ధనవంతుడి ఆరోగ్యం దేవుని దయవలన కుదుటపడింది. శక్తిపుంజుకున్నాక తన యొద్దకు ప్రతి దినం వచ్చి తన యోగక్షేమాలు తెలుసుకున్న ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలనుకున్నాడు. తన క్షేమం కొరకు అంత శ్రద్ధ చూపించిన అతనికి కృతజ్ఞతలు తెలపాలి అనుకున్నాడు ఆ మరుసటి దినము ఆ అపరిచితుడు వచ్చి ఆ ధనవంతుడి ఆరోగ్యం గురించి విచారించగా, ఆ ధనికుడు బయటకు వచ్చి అతనికి ధన్యవాదాలు తెలియజేసి నీవెవరు? అని అడిగాడు. అప్పుడు అతడు అయ్యా “నేను శవపేటికలు తయారుచేయువాడిని అని బదులిచ్చాడు.”
వెలుపల వెన్న లోపల మురికి కాలువ
ప్రేమ ప్రయోజనమును విచారించు కొనదు” 1కొరింథీ 13:5

                             ఒక చిన్న కుర్రాడు ఇంటిలో మౌనంగా తన హోం వర్క్ చేసుకుంటున్నాడు. ఆ ఇంటిలో ఒక మూల ఒక కప్ప ఆగకుండా అరుస్తూనే ఉంది. దాని శబ్దం ఆ కుర్రాడికి భంగం కలిగిస్తోంది. ఆ కుర్రాడికి విసుగు వచ్చి దానిని చంపాలనుకున్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టాడు. తర్వాత ఆ కప్పను చేతపట్టుకుని ఆ నీటిలో వేశాడు. తనను నీళ్లలో వేసినందుకు ఇప్పుడు కప్పకు చాలా సంతోషంగా ఉంది అది తప్పించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. అతడు పొయ్యిలో మంటను పెట్టాడు, నీళ్లు కొద్దిగా వేడి అవటంతో కప్పకు చాలా సౌకర్యంగా అనిపించి చాలా సంతోషిస్తుంది. ఆ అబ్బాయి మంటను పెంచుతూనే ఉన్నాడు. కప్ప అపాయమును పసిగట్టేలోపలే నీళ్లు మరగడం ప్రారంభమైంది. తుదకు కప్ప తన ప్రాణం విడిచింది.

                             పాపంతో ఆడుకోకు పాపంతో ఆడుకోవడం అనేది నిప్పుతో చెలగాటం వంటిది. కప్ప ఆ వేడి నీళ్లలో సూచించినట్లుగా దేవుని బిడ్డలు పాపములో పడి దానియందు ఆనందించకూడదు. సాతాను మొదట పాపపు రుచిని చూపిస్తాడు. ఆ తరువాత పెద్ద పెద్ద పాపాలతో మనలను ఆకర్షిస్తాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద పాపాలు మనం చేయునట్లుగా మనలని ప్రోద్భళిస్తాడు. తుదకు మనలను పూర్తిగా నాశనం చేస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమునసహ్యించుకొనిటయే.

విశ్వాసం అనునది శూన్య స్థితి నుండి సమృద్ధి స్థితితో ముగించును.

                        ఓడ బ్రద్దలు అయిన స్థితిలో ఉన్న ఇద్దరు మనుషులను గూర్చిన కధ ఒకటి ఉన్నది. జన సంచారం లేని నిర్మానుష్యమైన దీవిలో తాము ఉన్నట్టు వారు కనుగొన్నారు. చెట్లు కొమ్మలతో ఆకులతో తమ కొరకు ఒక నివాసము వారు కట్టుకున్నారు. వీరిద్దరిలో ఒకడు దేవుని యందు విశ్వాసము గలవాడు మరొకడు అవిశ్వాసి. జరిగిన ప్రతి అనర్థము వెనుక మంచిదేదో ఒకటి ఉండునని తలంచితే రెండోవాడు అతన్ని చూసి అపహాస్యం చేసే వాడు. ఇద్దరూ ఒకరితో ఒకరు సర్దుకుపోతూ కాలం గడపసాగారు. ప్రతి రోజు సముద్రతీరానికి వెళ్లి తమ చేతి రుమాలును విసురుతూ ఏదైనా ఒక ఓడ అటుగా వచ్చి వారిని రక్షించక పోతుందా అని నిరీక్షించసాగారు. సాయంకాలము తమ గుడిసె అగ్నిచేత తగులబడి బూడిదగా మిగిలిపోయింది. అవిశ్వాసి తన ఓర్పు నశించి తమ దుస్థితిని బట్టి శపించుకోసాగాడు. “స్నేహితుడా, కొంచెం ఓపిక పట్టు. ఈ దుర్ఘటనలో నుండి దేవుడు ఏదో ఒక మంచి మేలు మనకు చేయకపోడని ” విశ్వాసి పలికాడు. అవిశ్వాసి కోపంగా, ” నీవు, నీ దేవుడు మీతో నాకేం సంబంధం లేదు ” అని ఆక్రోశించాడు.

                   మరునాటి ఉదయం వారు సముద్రతీరానికి వెళ్ళేటప్పటికి ఒక చిన్న పడవ వారి కోసం సిద్ధంగా ఉంది. ఆ పడవ నావికుడు ఈలాగు చెప్పాడు ” నిన్న సాయంత్రం పోగ ఈ దీవినుండి పైకి రావటం మేము చూచి ఎవరో మన సహాయం కొరకు వేచి ఉన్నారు అని తలంచి ఇక్కడకు వచ్చినట్లు” చెప్పాడు. ఓడ నావికుడి మాటలు విన్న తర్వాత అవిశ్వాసి సిగ్గుపడి, విస్మయం పొందాడు. ఓడ నావికుడు వారిని అలా రక్షించాడు.

నేను మిమ్మును విడువను, ఎన్నడును ఎడబాయని ప్రభువు చెప్పెను (హెబ్రీ 13 : 5 )

                ఒక వ్యక్తి ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. అనగా నడుస్తున్నా, కూర్చునివున్న, పనిచేస్తున్న అతడు నిత్యము దేవుని స్తుతిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు తన మార్గంలో వెళుతూ ఉండగా నేల మీద ఒక రూపాయి బిళ్ళ పడి ఉండటం చూశాడు. ఆ వ్యక్తి ఆ రూపాయి బిళ్ళను తీసుకుని నడుస్తూ ఇలా ఆలోచించాడు. ఈ రూపాయి బిళ్ళతో నేను గోలి సోడా లేదా మజ్జిగ లేదా చల్లటి పానీయము ఏదో ఒకటి తాగాలి అని ఆలోచించుకుంటూ వెళుతున్నాడు. ఆలోచనల్లో పడి పోయి అతడు దేవుని స్తుతించడం మర్చిపోయాడు. తన ఆలోచనల్లో తాను ఉండిపోయాడు. హఠాత్తుగా తాను దేవుని స్మరించడం మరిచి పోయిన సంగతి జ్ఞప్తికి వచ్చి ఆ ఒక్క రూపాయి తాను దేవుణ్ణి మర్చిపోయేలా చేసింది అని అనుకున్నాడు, విసుగొచ్చి ఆ రూపాయి బిళ్ళను నేల మీదకు విసిరి కొట్టి దానివైపే చూస్తూ ఒక్క రూపాయి నా దేవుణ్ణి మరిచిపోయేలా నన్ను మార్చిందే, ఇక ఈ లోకంలో విస్తారమైన సంపద కలిగిన ఈ ధనవంతుల పరిస్థితి ఏమిటి?, వారు దేవుని ఎలా గుర్తుంచుకుంటారు?

నీ దేవుడైన యెహోవా నిన్ను మర్చిపోయేదెవేమో జాగ్రత్త……నీవు తిని తృప్తి పొంది మంచి ఇండ్లను కట్టించుకుని వాటిలో నివసిస్తూ….. నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లు నప్పుడు నీ మనసు మధించి నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. ద్వితి 8: 10- 15

               మంచుతో కప్పబడి ఉన్న ఒక కోటలోనికి ఒక సందేశకుడు వచ్చి ఆ కోట తలుపును తట్టాడు. ఆ తలుపు అవతల నుండి జవాబే లేదు. మరొక సారి ప్రయత్నించాడు. కేవలం తాను తలుపు తట్టిన శబ్దం తప్ప మరేమీ వినిపించలేదు. ఆ భవనం లోపల మనుషులు ఎవరైనా ఉన్నారేమో అని ఆ కిటికీలోనుంచి చూశాడు. కోపోద్రిక్తుడై రెట్టించిన ఆగ్రహంతో ఒక ఇనుప కర్రతో ఆ తలుపు గుమ్మాన్ని అదే పనిగా కొట్టసాగాడు. 20 30 సార్లు ఆ తలుపు కొట్టడం జరిగింది. కొద్ది సేపటికి చాలా చిన్న స్వరంతో ఒక వ్యక్తి జవాబిచ్చింది. అతడు ఇంతలా తలుపు కొడితే మీరు తలుపు తెరువరా అని అడిగితే ఆ వ్యక్తి “ఈ చుట్టుప్రక్కల ఉన్న చిన్న పిల్లలు ఇక్కడికి వచ్చి తలుపును రెండు మూడు సార్లు కొట్టి పారిపోతుంటారు. అందుకే మేము పట్టించుకోకుండా ఉండడం నేర్చుకున్నాము. కానీ మీరు గట్టిగా ఆపకుండా కొట్టడం విని మీరు తప్పనిసరిగా లోనికి రావాలన్నా ఉద్దేశం ఉందని నాకు అనిపించింది. అందుకే నేను తలుపు తెరిచాను అని చెప్పింది”.

                      లోభి అయినా ఒక కోటీశ్వరుడు చనిపోయి పరలోక ద్వారం వద్దకు వచ్చి తలుపు తట్టాడు. “ఎవరు నీవు?” అని అడిగింది దూత. “నేనెవరో తెలియదా? నేను కోటీశ్వరుడను నా పేరు సురేష్ కుమార్ “అని చెప్పాడు. అప్పుడు ఆ దూత ” ఏమి చేసి పరలోకములో ప్రవేశించుటకు అర్హత సంపాదించావు? ” అని ప్రశ్నించగా, ఆ కోటీశ్వరుడు ఒక క్షణం ఆలోచించి, “నేను ఒకసారి ఒక వృద్ధురాలు ఆకలితో అలమటిస్తూ ఉండగా ఒక రూపాయి దానం చేశాను” అని చెప్పాడు. అప్పుడా దూత “ఈ విషయం గ్రంధములో వ్రాయబడిందా? “అని అడిగాడు గ్రంధకర్తను. ఆ గ్రంథకర్త “అవును ఆ విషయం ఈ గ్రంథములో వ్రాయబడియున్నది” అని చెప్పాడు. ఆ దూత తలఊపి, ” ఇంకా ఏమైనా పుణ్యకార్యాలు చేసావా” అని అడిగాడు. అందుకతడు ” మా సంఘంలో వికలాంగుడైన ఒక పేద కుర్రాడు ఉండేవాడు, కొన్ని వారాల క్రితం నేను అతనికి ఒక రూపాయి దానం చేశాను” అని చెప్పాడు. ఆ దూత పరిశీలించగా ఆ విషయం గ్రంథములో వ్రాయబడియున్నది. “ఇంకా ఏమేమి చేసావు?” అని అడిగాడు. అందుకు ఆ కోపిష్టి అయిన కోటీశ్వరుడు “నాకు అంతే గుర్తుంది” అని బదులిచ్చాడు. అప్పుడు ఆ దూత “మనము అతనిని ఏమి చేద్దాం” అని గ్రంధకర్తను సంప్రదించగా, అతను ఇలా చెబుతూ “ఇతను దానం చేసిన ఆ రెండు రూపాయలను అతనికి ఇచ్చి వేసి దానితో పాటు వడ్డీగా మరియొక రూపాయి కూడా అతనికి ఇచ్చి నరకమునకు పంపివేద్దాం” అని చెప్పాడు.

సామెతలు 19: 17
“బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చు వాడు వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును.”

ప్రసంగి 11: 1-2
“నీ ఆహారమును నీళ్లమీద వేయుము,చాలా దినము… లైన తరువాత అది నీకు కనబడును. ఏడుగురికిని ఎనమండు గురికిని భాగము పంచిపెట్టుము, భూమిమీద ఏమి కీడు జరుగునో నీవెరుగవు.”

లూకా 6: 37 -38
తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు; నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు; క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు; ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగ జారునట్లు నిండుకొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.

 

        ఒక ఖగోళశాస్త్రజ్ఞుడు తన మేడమీద ఒక పెద్ద దూరదర్శిని ఏర్పాటు చేశాడు మరియు ప్రతి రాత్రి అతను పైకి వెళ్లి ఆకాశంలో వున్న అద్భుతములను చూస్తుండేవాడు: ప్రకాశవంతమైన నక్షత్రములు, పెద్ద చంద్రుడు, తోకచుక్కలు మరియు ఉల్కలు. పగలు కన్నా రాత్రుల్లో జరిగే అద్భుతాలను చూస్తూ వాటి మీద మిక్కిలి ఆ శక్తిని పెంచుకొని దాని మీద ఉంచాడు.
ఒక రాత్రి ఆయన ఒక ఘటసర్పము చందమామ మధ్యలో కూర్చుని ఉండడం చూసాడు. దాని శరీరము ప్రకాశవంతమైన నీలిరంగుతో,దాని రెక్కలు ఊదా రంగులో ప్రకాశవంతంగా ఉన్నాయి, అనేక రోమములతో వున్నా కాళ్ళు, మరియు గాజువంటి పెద్ద కళ్ళతో విచిత్రమైన తలతో ఉండినది. నిద్రపోతున్నట్లుగా కనిపించింది:అది ఏ మాత్రం కదలకుండా అలాగే వుండినది.
అతడు ఎంతో ఉద్రేగం చెంది, ఆ ఊరికి గొప్ప పేరును తెచ్చే వింతను తాను కనుగొన్నానని చూడమని అందరికీ చెప్పాడు. ఆ చందమామ మధ్యలో నిద్రించే ఘటసర్పాన్ని చూడటానికి అందరూ వచ్చి వరుసగా నిలబడ్డారు. వారందరూ ఆ డ్రాగన్ను జోజి ఆశ్చర్యపోయి మెచ్చుకుంటూ ఉన్నారు.
అయితే కొద్ది సేపు అయిన తర్వాత ఒక వృద్ధ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆ టెలిస్కోప్ నుండి ఒకసారి చూసి చిరునవ్వునవ్వాడు. ఆ టెలిస్కోప్ ముందుకు వెళ్ళి దాని ముందుభాగములో వున్న కటకమును విప్పదీసి దానిలో వున్న చచ్చిపోయిన చిన్న ఈగను బయటికి తీసాడు. “యవ్వనస్థుడా, ఇతర విషయాలను కనుగొనే ముందు మొదట నీ టెలిస్కోప్ ను జాగ్రత్తగా పరీక్షించి శ్రద్ధ చేసుకోవాలి…..” అని అతను అన్నాడు.