వేడి నీటిలో ఉన్న కప్ప

వేడి నీటిలో ఉన్న కప్ప

Views: 279
0 0
Read Time:2 Minute, 4 Second

వేడి నీటిలో ఉన్న కప్ప

ఒక చిన్న కుర్రాడు ఇంటిలో మౌనంగా తన హోం వర్క్ చేసుకుంటున్నాడు. ఆ ఇంటిలో ఒక మూల ఒక కప్ప ఆగకుండా అరుస్తూనే ఉంది. దాని శబ్దం ఆ కుర్రాడికి భంగం కలిగిస్తోంది. ఆ కుర్రాడికి విసుగు వచ్చి దానిని చంపాలనుకున్నాడు. అతడికి ఒక ఆలోచన వచ్చింది. అతడు ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకుని పొయ్యి మీద పెట్టాడు. తర్వాత ఆ కప్పను చేతపట్టుకుని ఆ నీటిలో వేశాడు. తనను నీళ్లలో వేసినందుకు ఇప్పుడు కప్పకు చాలా సంతోషంగా ఉంది అది తప్పించుకోవటానికి కూడా ప్రయత్నించలేదు. అతడు పొయ్యిలో మంటను పెట్టాడు, నీళ్లు కొద్దిగా వేడి అవటంతో కప్పకు చాలా సౌకర్యంగా అనిపించి చాలా సంతోషిస్తుంది. ఆ అబ్బాయి మంటను పెంచుతూనే ఉన్నాడు. కప్ప అపాయమును పసిగట్టేలోపలే నీళ్లు మరగడం ప్రారంభమైంది. తుదకు కప్ప తన ప్రాణం విడిచింది. పాపంతో ఆడుకోకు పాపంతో ఆడుకోవడం అనేది నిప్పుతో చెలగాటం వంటిది. కప్ప ఆ వేడి నీళ్లలో సూచించినట్లుగా దేవుని బిడ్డలు పాపములో పడి దానియందు ఆనందించకూడదు. సాతాను మొదట పాపపు రుచిని చూపిస్తాడు. ఆ తరువాత పెద్ద పెద్ద పాపాలతో మనలను ఆకర్షిస్తాడు. ఆ తర్వాత పెద్ద పెద్ద పాపాలు మనం చేయునట్లుగా మనలని ప్రోద్భళిస్తాడు. తుదకు మనలను పూర్తిగా నాశనం చేస్తాడు. యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట చెడుతనమునసహ్యించుకొనిటయే.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ఉపమానాలు (Parables) సండే స్కూల్ కధలు